హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అగ్రికల్చర్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సొసైటీ కార్యదర్శి సైదు లు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశం పొందగోరె విద్యార్థులు 21 నుంచి 29వ తేదీలోగా https:// mjpt bcwreis.telangana.gov.in, https:// www. pjtau. edu.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ బైపీసీ చదివి, తెలంగాణ స్టేట్ టీజీ ఈఏపీసెట్- 2025 పరీక్షలో అర్హత సాధించిన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.