వరంగల్ చౌరస్తా, జనవరి 23: బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో యూనివర్సిటీ పరిధిలో మొదటి విడత కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేపట్టనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. తుది మెరిట్ జాబితాతోపాటు కళాశాలల వారీగా సీట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చామని చెప్పారు. అర్హులు ఈ నెల 24న ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను పరిశీలించాలని కోరారు.