మెట్పల్ల్లి, జూన్28: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల క్యాంప్ క్రాసింగ్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. నియోజకవర్గ పర్యటనలో భా గంగా మెట్‌పల్లికి వచ్చి కారులో తిరిగి కోరుట్ల వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టోయింగ్ వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాలు ఊడిపోయాయి. మంత్రి కారు వెనుక వస్తున్న ఎస్కార్ట్ వాహనం, కాన్వాయ్‌లోని వాహనాల డ్రైవర్లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. దీంతో అడ్లూరి మరో కారులో బయలుదేరి వెళ్లారు. టోయింగ్‌తో వెళ్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.