హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఎస్టీ కులధ్రువీకరణ పత్రాల జారీలో అడ్వకేట్ జనరల్‌ను సంప్రదించి.. సరళమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో గిరిజనుల సమస్యలపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగ లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఒక ప్రాంత సమస్యను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేయకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. గిరిజన ప్రాంత సమస్యల పరిషారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.