హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీ, ఢిల్లీ గ్యాంగ్‌పై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ‘ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మానమర్యాదలను అమ్ముకొన్నవాళ్లు.. ప్రజాస్వామ్యాన్నే వేలానికి పెట్టారు’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి గురువారం సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో ప్రదర్శించిన వీడియోను ట్యాగ్ చేశారు.