Engineering Colleges | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో రిజర్వేషన్ నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ ఎస్టీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ బి క్యాటగిరీ (మేనేజ్మెంట్ కోటా), సి క్యాటగిరీ (ఎన్నారై కోటా) సీట్లను కోట్లకు విక్రయిస్తున్న దారుణమైన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చిన ఈ ప్రైవేట్ కళాశాలలపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.