హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): మహిళల పట్ల బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతోపాటు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాందేవ్ మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో అక్కడున్నవారు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని పేర్కొన్నారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి పతంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్న దుర్మార్గుడు బాబా రాందేవ్ అని మండిపడ్డారు. యోగా పేరుతో సానుభూతి నటిస్తూ కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.