హుజూరాబాద్‌టౌన్, జూన్ 1: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన ఏక్తాయాత్రలో బండి సంజయ్ మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం హుజూరాబాద్ ఏసీపీ కే వెంకట్‌రెడ్డికి ఫిర్యాదు పత్రం అందజేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పార్లమెంట్లో చేసిన చట్టాన్ని అతిక్రమిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండిపై తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు.