‘యూజ్లెస్ ఫెలో..విద్యార్థులను ఎందుకు రెచ్చగొడుతున్నవ్..కేసు బుక్ చేసి లోపలేస్తా..’అంటూ అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ టీ న్యూస్ రిపోర్టర్ యాసర్ అహ్మద్‌పై చిందులు తొక్కారు. మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళనను కవర్‌చేస్తున్న టీ న్యూస్ ప్రతినిధి, కెమెరామెన్‌పై జులుం ప్రదర్శించారు. కెమెరాను గుంజుకొనేందుకు యత్నించారు. రిపోర్టర్‌ను ఉద్దేశించి.. విద్యార్థుల మాదిరిగా బ్లూ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినవ్..? ఇక్కడ తమాషా చేస్తున్నవా?..విద్యార్థులను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నవ్..? నీకేమన్నా పిచ్చిలేసిందా..బొక్కలో తోస్తా..’ అంటూ తిట్లదండకం అందుకున్నారు.. సార్ నా పని నేను చేస్తున్నా.. మీ పని మీరు చేయండి..అని ప్రాధేయపడ్డా వినకుండా రిపోర్టర్, కెమెరామెన్‌ను దూషిస్తూ నెట్టివేశారు. ఏసీపీ తీరుపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు.