మహబూబ్‌నగర్, మార్చి 1 (నమస్తే తెలం గాణ ప్రతినిధి): ‘కార్మికులు పనిచేస్తున్నచోట టన్నెల్ కుప్ప కూలింది.. ఆరుగురు ఒకచోట.. ఇద్దరు మరోచోట చిక్కుకున్నారు. మట్టి.. నీళ్లు కలిపి స్లాష్లాగా మారి వారిపైన పడింది. వారు ప్రాణాలతోనే ఉన్నారని నేనొక డాక్టర్‌గా అనుకోవడం లేదు’ అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం ఆయన దోమలపెంటలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సంఘటన రోజే చ నిపోయి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు.
బతికి ఉన్నారా? చనిపోయారా?
రామగిరి, మార్చి 1: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. నల్లగొం డ జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గల్లంతైన వారి జాడపై నేటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.