Minister Gangula | రాజకీయ పబ్బం గడుపుకునేందుకే తనపై ఆరోపణలు : మంత్రి గంగుల
Minister Gangula | బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు.
కరీంనగర్ : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కూడా అసత్యపు ఆరోపణలు చేసినా నాయకులు నేడు బీసీలకు అందించే లక్షా ఆర్థిక సహాయంపై కూడా అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అర్హులైన బీసీలందరికీ(BC Beneficiaries) విడతల వారీగా సహాయం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ వద్దు అన్న పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓట్లకోసం గ్రామాల వెంట పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయట పడ్డదని, కనీసం ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఈడీ, సీబీఐ(CBI), ఐటీ వంటి సంస్థలు తన మీద విచారణ చేసినా ఏమీ తేలలేదని అన్నారు. ఎన్నికల్లో ఎంఐఎం మాత్రమే కాదు కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయొచ్చని అన్నారు. తన జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

