హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులు, అగ్రికల్చర్ అండ్ కోపరేటివ్ డిపార్టుమెంట్‌లోని అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు బుధవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఫలితాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు.
త్వరలోనే మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలుస్తామని చెప్పారు. అయితే, నిరుడు మే నెలలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు, ఆగస్టులో అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే