ఆ చట్ట ప్రకారం కేంద్రమే కొనుగోలు చేయాలి : మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట : కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి వరి, గోధుమ గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు.. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష లలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ లను నియంత్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న మంత్రి, రాష్టాలలో పండిన పంటలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తరలించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశంలో ఆకలి కేకల సూచీ అధ్వానంగా కింది స్థాయికి పడిపోయిందన్నారు.తెలంగాణ రాష్ట్రం వల్లే సోమాలియా తరహా ఆకలి కేకలు దేశం లో తప్పాయన్నారు. కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్న బీజేపీ దుర్మార్గపు రాజకీయాలకు చరమగీతం పాడాలని మంత్రి పిలుపు నిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

