ఎదురొచ్చిన మృత్యువు
- ఆటోను ఢీకొట్టిన కంటెయినర్
- నలుగురు దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు
- మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు
- సంగారెడ్డి జిల్లా అల్మాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
అందోల్, మార్చి 14: లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఓ మహిళకు భర్తతోపాటు ఇద్దరు బిడ్డలను దూరం చేయగా.. మరో కుటుంబంలో ఇంటి పెద్దను బలితీసుకొన్నది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అల్మాయిపేట్ వద్ద ఆదివారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్ర మాదంలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్, అతడి భార్య పద్మ ఆటోలో అందోల్ మండలం మన్సాన్పల్లిలో బంధువుల శుభకార్యానికి బయలుదేరారు. సంగారెడ్డిలో వారి బంధువులైన భవానీ, శ్రావణ్, స్వప్న, రమేశ్, సాయిచరణ్, సాయివిఘ్నేశ్ను ఎక్కించుకొన్నారు. ఆటో అల్మాయిపేట్ శివారులోకి చేరుకోగానే ఎదురుగా జోగిపేట వైపునుంచి వస్తున్న కంటెయినర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న సంగారెడ్డి శివాజీనగర్‌కు చెందిన శ్రావణ్ (40), అతడి కుమారులు సాయివిగ్నేశ్(11), సాయిచరణ్(7) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులు పద్మ, భవానీ, స్వప్న, రమేశ్, వెంకటేశ్‌ను సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్సపొందుతూ వెంకటేశ్ (39) మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శుభకార్యానికి వెళ్లొస్తూ పరలోకాలకు..
- ఔటర్‌పై కంటెయినర్‌ను ఢీకొట్టిన కారు
- దంపతులు సహా ముగ్గురు దుర్మరణం
శామీర్‌పేట, మార్చి 14: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటె యినర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టగా ముగ్గురు దుర్మర ణం చెందారు. ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన కరుణాకర్ (46), భార్య సరళ (38), అమె చెల్లెలు సంధ్య (30) ఆదివారం ఉదయం కారులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం నర్సన్నపేటలో ఓ శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 8 గంటలకు రాజీవ్హ్రదారిపై నుంచి మేడ్చల్ జిల్లా శామీర్‌పేట టోల్‌ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కారు లియోనియా రిసార్ట్ సమీపంలో ముందు వెళ్తున్న కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టి దాని కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శామీర్‌పేట సీఐ సంతోషం, అల్వాల్ ట్రాఫిక్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని కంటెయినర్ కిందికి వెళ్లిన కారును యంత్రాలసాయంతో వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

