నాగర్ కర్నూల్ : ప్రమాదవశాత్తు ఓ పావురానికి ( Pigeon ) ఉరిపడి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ ( Nagarkurnul ) జిల్లా కలెక్టరేట్ భవనంలో చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే మంగళవారం కూడా ఓ పావురం కలెక్టరేట్ భవనంలో సేద తీరింది. అనంతరం ఆహారం తీసుకెళుతుండగా భవనానికి ఉన్న రేలింగ్ వద్ద ప్లాస్టిక్ తాడు కట్టి ఉండడంతో పావురం ఎగిరిపోయే క్రమంలో ప్రమాదవశాత్తు మెడకు చుట్టుకుంది. దీంతో ఊపిరాడక పావురం మృత్యువాత పడింది.
రెండవ అంతస్తు వద్ద ఉరితీసినట్టుగా వేలాడుతున్న ఆ పావురాన్ని డీఈవో కార్యాలయ డ్రైవర్ అశోక్ గమనించి దానిని ఉరి నుంచి తొలగించారు. అనంతరం కననం చేశాడు. ప్లాస్టిక్ తాడు వల్లే పావురానికి ఉరి బిగుసుకుపోయిందని గుర్తించాడు. ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు తెలియకుండానే కొన్ని స్వేచ్ఛ జీవులు మృత్యువాత పడుతున్నాయనేది గుర్తుంచుకొని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరాడు.