హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం మరోసారి విచారించింది. రేస్ నిర్వహణ, నగదు బదిలీపై ఆయనను ఆరున్నర గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని బీఎల్ఎన్ రెడ్డికి స్పష్టం చేసిన ఏసీబీ అధికారులు.. ఆయనను మారోసారి విచారణకు పిలువనున్నట్టు తెలుస్తున్నది.