రైతుబీమా కోసం 10 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన మానుకోట జిల్లా నీలికుర్తి క్లస్టర్ ఏఈవో
రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది.
మరిపెడ, నవంబర్ 6 : రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మరిపెడ మండలం నీలికుర్తి క్లస్టర్‌లోని ఆనేపురం రెవెన్యూ పరిధి స్టేజీతండాకు చెందిన గుగులోత్ భీమా అనే రైతు గత నెల 14న మరణించాడు.
ఆయనకు సంబంధించిన రైతుబీమా పథకం కోసం కొడుకు గుగులోత్ వసంత్ గతనెల 30న ఏఈవో సందీప్‌ను కలిశాడు. తనకు రూ.20 వేలు లంచం ఇస్తేనే రైతుబీమా పథకం కోసం ఆన్లైన్ చేస్తానని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని వసంత్ వేడుకోగా రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని జేజే రెస్టారెంట్ ఎదురుగా బాధితుడి నుంచి ఏఈవో రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో విచారణ చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Acb
- AEO
- bribe
- Farmer insurance
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

