హైదరాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను ఈ నెల 15న నిర్వహించనున్నట్టు లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ సుదర్శన్ ఆచార్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్టుదేవ్ వర్మ, కేంద్రం మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్టు ఆయన తెలిపారు.