పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్న ఆకాష్-బైజూస్ గురువారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో తమ ఏడో తరగతి గదిని ప్రారంభించింది. ఈ కేంద్రంలో ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తరగతులు అందించటంతో పాటు ఫౌండేషన్ స్థాయి కోర్సులను సైతం అందించనున్నారు. 11వ తరగతి గదుల్లో వెయ్యి మంది విద్యార్థులు అభ్యసించే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆకాష్-బైజూస్ రీజినల్ డైరెక్టర్ ధీరజ్‌కుమార్ మిశ్రా, రీజినల్ బిజినెస్ హెడ్ భరత్‌కుమార్ పాల్గొన్నారు.