Suicide | ఘట్కేసర్లో విషాదం.. రైలుకింద పడి దంపతులు ఆత్మహత్య
Suicide | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం నెలకొంది. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Suicide | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం నెలకొంది. ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), శిరీష్ (28) భార్యాభర్తలు. జీవనోపాధి కోసం కొంతకాలం కింద హైదరాబాద్కు వచ్చిన వీరు హయత్నగర్ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి వీరిద్దరూ బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా దంపతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

