Jainoor | జైనూర్, ఏప్రిల్ 24 : ఇద్దరమ్మాయిలను ప్రేమించిన ఓ యువకుడు.. ఇరువర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఘటన గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డేశ్వరలో చోటుచేసుకుంది. అడ్డేశ్వరకు చెందిన ఆత్రం చత్రుశావ్.. అదే గ్రామానికి చెందిన జంగుబాయితో పాటు సాంగ్వికి చెందిన సోన్దేవిని నాలుగేళ్లుగా ప్రేమించాడు.
చత్రుశావ్ ఆ ఇద్దరి యువతుల పెద్దలను ఒప్పించి, పెండ్లి పత్రికలు అచ్చువేయించి బంధుమిత్రులకు ఆహ్వానం పంపారు. 500 మంది అతిథుల సమక్షంలో గిరిజన సంస్కృతీసంప్రదాయాల నడుమ పచ్చని పందిరిలో ఇద్దరి మెడలో తాళికట్టాడు. ప్రస్తుతం వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.