Triangle Love story | ప్రేయసి దక్కదని స్నేహితుడి హత్య.. గుండె తొలగించి, వేళ్లు వేరు చేసి యువతికి వాట్సాప్
Triangle Love story | వాళ్లిద్దరు మంచి స్నేహితులు..బతికినంత కాలం మన దోస్తాన్ కొనసాగాలని అనుకొన్నారు. కానీ ఒకే యువతిని ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆమె తనకు దూరమవుతుందేమోనన్న కోపంతో ప్రాణ స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తల, చేతివేళ్లు నరికి, గుండెను చీల్చి.. ఫొటోలు తీసి యువతికి పంపించాడు.
Triangle Love story | పెద్దఅంబర్‌పేట, ఫిబ్రవరి 25: వాళ్లిద్దరు మంచి స్నేహితులు..బతికినంత కాలం మన దోస్తాన్ కొనసాగాలని అనుకొన్నారు. కానీ ఒకే యువతిని ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆమె తనకు దూరమవుతుందేమోనన్న కోపంతో ప్రాణ స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తల, చేతివేళ్లు నరికి, గుండెను చీల్చి.. ఫొటోలు తీసి యువతికి పంపించాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ నెల 17న జరగగా, శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, బాధితుడి కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ (22), వరంగల్‌కు చెందిన హరిహరకృష్ణ దిల్సుఖ్నగర్ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివారు. అనంతరం నవీన్‌కు ఇంజినీరింగ్‌లో సీటు లభించడంతో నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో జాయిన్కాగా, హరిహరకృష్ణ పీర్జాదిగూడలోని ఓ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్లో ఉన్నప్పుడు నవీన్‌కు ఓ యువతితో పరిచయమైంది. ఇద్దరు కొంతకాలం చనువుగా ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇదే సమయంలో హరిహరకృష్ణ ఆ యువతికి దగ్గరయ్యాడు. విషయం తెలుసుకొన్న నవీన్ మళ్లీ యువతితో మాట్లాడటం ప్రారంభించాడు. నవీన్ ఆ యువతికి దగ్గరవుతుండటంతో హరిహరకృష్ణ భరించలేకపోయాడు. ఈ విషయంపై స్నేహితులిద్దరు పలుమార్లు గొడవపడ్డారు. నవీన్ మళ్లీ దగ్గరైతే యువతి తనకు దూరమైపోతుందేమోనన్న అక్కసుతో ఎలాగైనా అంతమొందించాలని హరిహరకృష్ణ పక్కాగా స్కెచ్ వేశాడు.
గెట్ టు గెదర్ పార్టీ ఉన్నదని పిలిచి ఘాతుకం
ఈ నెల 17న ఇంటర్ స్నేహితుల గెట్ టు గెదర్ పార్టీ ఉన్నదని చెప్పి నవీన్‌ను హైదరాబాద్‌కు రప్పించాడు. సాయంత్రం వరకు స్నేహితుల గదిలో మాట్లాడుకొన్నారు. అక్కడే నవీన్, హరిహరకృష్ణ గొడవపడినట్టు తెలిసింది. అనంతరం నవీన్‌ను బైక్‌పై ఎక్కించుకొన్న హరిహరకృష్ణ పెద్దఅంబర్‌పేట వద్ద మద్యం తీసుకొని అబ్దుల్లాపూర్‌మెట్ శివారులో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మద్యం తాగిన అనంతరం కసితో ఉన్న హరిహరకృష్ణ నవీన్ గొంతునులిమి, కత్తితో పొడిచి చంపేసినట్టు తెలుస్తున్నది. వెంట తెచ్చుకొన్న కత్తితో చేతివేళ్లు నరికి, తల, మొండెం వేరు చేయడంతోపాటు మర్మాంగాలను కోసి, ఛాతిని చీల్చాడు. తన ఫోన్లో నవీన్ ఫొటోలు తీసి ప్రేయసి వాట్సాప్‌కు పంపినట్టు సమాచారం.
అమ్మాయి దూరమౌతుందనే హతమార్చా..
యూనివర్సిటీ నుంచి వెళ్లిన నవీన్ తిరిగి రాకపోవడంతో అతని స్నేహితులు ఆరాతీశారు. హరిహరకృష్ణతో కలిసి పార్టీ చేసుకొన్నట్టు తెలుసుకున్నారు. గొడవ జరగడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లో వదిలిపోయానని హరిహరకృష్ణ చెప్పినట్టు నవీన్ స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకొన్న నవీన్ తండ్రి శంకరయ్య ఈ నెల 22న నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవీన్ స్నేహితులను విచారించారు. ఎలాగైనా పట్టుబడుతానన్న ఉద్దేశంతో శుక్రవారం రాత్రి హరిహరకృష్ణ స్వయంగా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలిసింది. యువతి దూరమైపోతుందేమోనని తానే హత్య చేశానని అంగీకరించినట్టు సమాచారం. నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాల నాయకులు శనివారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్టు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

