ప్రేమ పేరుతో ఆకతాయిల వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి
ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం చోటుచేసుకుంది.
ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం చోటుచేసుకుంది.
చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రాజలింగం-రజిత కుమార్తె కొత్త కల్యాణి (19) డిగ్రీ మానేసి ఇంటి వద్దే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే యువకులు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలని లేదంటే తమతో దిగిన ఫొటోలను సోషల్మీడియాలో పెడతామని వేర్వేరుగా బెదిరిస్తున్నారు.
ఈ నెల 6వ తేదీన తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో తమ బంధువు చనిపోయారని కల్యాణి తల్లిదండ్రులు అక్కడి వెళ్లారు. సోదరుడు కాలేజీకి వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న కల్యాణికి సదరు యువకుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ వేధింపులు తాళలేక కల్యాణి పురుగుల మందు తాగింది. అనంతరం తన తల్లిదండ్రులకు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. అప్పటికే కల్యాణి పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన స్థానికులు మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నల్గొండ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన కల్యాణి మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తన చావుకు ఇద్దరు యువకులే కారణమని చనిపోయే ముందు సదరు యువతి మరణవాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

