మామతో కలిసి భర్తను చంపిన మహిళ
తన మామతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. మృతదేహాన్ని తన ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో పూడ్చిపెట్టింది. ఈ అమానవీయ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
- మృతదేహాన్ని ఇంటి పక్కన ఖాళీ స్థలంలో పూడ్చివేత
- కామారెడ్డి జిల్లా తిర్మలాపూర్‌లో అమానుష ఘటన
బాన్సువాడ రూరల్, జూన్ 23: తన మామతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. మృతదేహాన్ని తన ఇంటి పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో పూడ్చిపెట్టింది. ఈ అమానవీయ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. తిర్మలాపూర్‌కు చెందిన కుర్మ రాములు (33) జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసై భార్య మంజుల, తండ్రి నారాయణను హింసించేవాడు.
దీంతో విసిగిపోయిన వారిద్దరూ ఈ నెల 9న మద్యం తాగి వచ్చిన రాములును గొడ్డలితో నరికి హత్యచేశారు. మృతదేహాన్ని ఇంట్లో ఉన్న సంపులో మూడురోజులపాటు ఉంచారు. పొరిగింటి వారు ఇతర గ్రామానికి వెళ్లగా.. సంపులోని మృతదేహాన్ని తీసి పక్కింటి వారి ఖాళీ స్థలంలో గుంతతీసి పాతిపెట్టారు. అంతేకాదు.. పది రోజులుగా రాములు కనిపించడం లేదని మృతుడి భార్య మంజుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పక్కింటి వారి స్థలంలో అనుమానాస్పదంగా తవ్విన గుంత కనిపించడంతో స్థానికులు వారిద్దరినీ నిలదీశారు. దీంతో రాములును తామే హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల సమక్షంలో గుంతను తవ్వగా రాములు మృతదేహాన్ని గుర్తించామని సీఐ కృష్ణ తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో గ్రామస్థాయి అధికారులు, స్థానికుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

