e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home తెలంగాణ మనసు మార్చుకున్న దొంగ

మనసు మార్చుకున్న దొంగ

  • మహాలక్ష్మీ ఆలయంలోకి చొరబడి.. దొంగతనం చేయకుండానే వెనక్కి
  • సోషల్‌ మీడియాలో ఆగంతకుడి సీసీ ఫుటేజీ వైరల్‌

మెట్‌పల్లి, మార్చి 12: ఓ వ్యక్తి ఆలయంలో చోరీకి పక్కా ప్లాన్‌ వేసుకున్నాడు. ఆ మేరకు గర్భగుడిలోకి వెళ్లాడు. విలువైన ఆభరణాలు కండ్ల ముందు కన్పించినా ముట్టుకోకుండానే వెనుదిరిగాడు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఆగంతకుడి కదలికల దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. పట్టణ శివారులో 63వ జాతీయ రహదారి పక్కన వట్టివాగు సమీపంలో శ్రీమహాలక్ష్మీ అమ్మవారి ఆలయం ఉన్నది. గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడ్డాడు. తాళం పగులగొట్టి గర్భగుడిలోకి వెళ్లాడు. అమ్మవారి నిలువెత్తు రూపాన్ని చూసి భయపడ్డాడో.. ఆలయంలో దొంగతనం చేయడం తప్పుగా భావించాడో తెలియదు కానీ అడుగు ముందుకు వేయలే దు. అమ్మవారి విగ్రహంపై ఉన్న ఆభరణాలు ముట్టుకోలేదు. ఆ వెంటనే వెనుదిరిగాడు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న అర్చకులు, సిబ్బంది అనుమానం వచ్చి సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలించగా చోరీకి యత్నించిన విషయం బయటపడింది. సమాచారం అం దుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని వి వరాలు సేకరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.  

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana