ఆదిలాబాద్ : వారిద్దరు మైనర్లు స్కూల్ వెళ్లి చక్కగా చదువుకోవాల్సిన వయసులో ప్రేమలో పడ్డారు. గమనించిన తల్లిదండ్రులు అది సరికాదు చదువుకోమని మందలించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..ఆదిలాబాబాద్ జిల్లా బేల మండలం ఆకుర్ల గ్రామానికి చెందిన (17 )ఏళ్ల బాలుడిని పాఠన్ గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న బాలిక(16) ప్రేమించింది.
విషయం తెలుసుకున్న తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చదువు మీద దృష్టి పెట్టాలని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి ఆత్మహత్య విషయం తెలుసుకున్న బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు తెలిపారు.