హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇన్స్పైర్ 2022-23 పోటీలకు 2,912 ప్రాజెక్ట్లు ఎంపికయ్యాయి. విద్యార్థుల ఎంట్రీలకు మనక్ అధికారులు ఆమోదం తెలిపారు. వర్కింగ్ మాడల్స్ రూపొందించేందుకు రూ.10 వేల చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమచేశారు. ఆయా విద్యార్థులకు డిసెంబర్లో జిల్లాస్థాయి ఎగ్జిబిషన్లు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు.