పూడూరు, జనవరి 11: పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్య త్తే ముఖ్యమని భావించిన ఓ ప్ర ధానోపాధ్యాయుడు మూడేండ్లుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మం డలం మేడిపల్లి కలాన్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఖాజామొహినొద్దీన్ సేవలను గుర్తించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ రవి బుధవారం ఆయన్ను ఘనంగా సన్మానించారు. విద్యార్థు చదువుపై శ్రద్ధ చూపుతూనే నిరంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసే ఉపాధ్యాయులకు సమాజం లో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్‌చైర్మన్ ఉస్మాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.