Tsunami | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): సునామీ సృష్టించే బీభత్సానికి బ్రేకులు వేసే వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎగిసిపడే రాకాసి అలలను దీటుగా ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఆరేండ్లలో సిద్ధం కానున్నది.
ఈ మేరకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్), ది యూనివర్సిటీ కా లేజీ లండన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 2030 నాటికి సునామీ ముప్పు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.