యాదాద్రి భువనగిరి : జిల్లాలో వీధి కుక్కలు (Stray Dogs) బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం(Vadaparthi) లో చిన్నారి ప్రణయ్‌పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ప్రణయ్ (Pranay)అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించి చికిత్స అందించారు. గ్రామంలో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు అధికారులకు మొర పెట్టుకున్నారు.