Heart Stroke | సిద్దిపేట : ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు( Heart Stroke )కు గురవుతున్నారు. ఆటో డ్రైవింగ్( Auto Driving ) చేస్తుండగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. 108 అంబులెన్స్( 108 Ambulance ) సిబ్బంది ఆ డ్రైవర్‌కు సీపీఆర్( CPR ) చేసి అతని ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా( Siddipeta Dist )లోని కొండపాక నుంచి కుక్కునూరుపల్లికి ఓ యువకుడు ఆటో నడుపుతూ బయల్దేరాడు. మార్గమధ్యలోనే ఆటోను ఆపి డ్రైవర్ కిందపడిపోయాడు. అక్కడే ఉన్న ఓ స్థానికుడు తక్షణమే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. క్షణాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది.. ఆటో డ్రైవర్‌కు సీపీఆర్( CPR ) చేశారు. సీపీఆర్ చేయడంతో బాధిత వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆటో డ్రైవర్‌ను పర్వతం రాజు(28)గా గుర్తించారు. అనంతరం రాజును గజ్వేల్ ఆస్పత్రి( Gajwel Hospital )కి తరలించారు.