ఎడ్‌సెట్‌లో 98.53% అర్హత

- ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉత్తీర్ణత
- తమ్మిశెట్టి మహేందర్‌కు ఫస్ట్ ర్యాంకు
- అకెనపల్లి ప్రత్యూషకు రెండో ర్యాంకు
- ఫలితాలు విడుదలచేసిన ప్రొఫెసర్ లింబాద్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎడ్‌సెట్‌లో 98.53 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎడ్‌సెట్‌లో ఇంతమంది క్వాలిఫై కావడం సెట్ చరిత్రలో ఇదే తొలిసారి. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్ నిర్వహించగా.. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. 33,683 (98.53%) విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది 77 శాతమే ఉత్తీర్ణులయ్యారని, 98 శాతానికిపైగా పాస్ కావడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు వెల్లడించాయి. పురుషులు 99.52 శాతం, మహిళలు 98.24 శాతం మంది అర్హత సాధించారు.
- బీఈడీ కోర్సుల్లో చేరే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 42 వేలమంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 32 వేల మంది మహిళలే ఉండటం గమనార్హం. అర్హత సాధించినవారిలోనూ వారే అధికం.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 100కు వందశాతం క్వాలిఫై కావడం గమనార్హం. ఎస్సీలు 4,770 మంది, ఎస్టీలు 7,868 మంది పరీక్ష రాయగా.. అంతా పాస్ అయ్యారు.
- భద్రాద్రి కొత్తగూడెం, విజయవాడ కేంద్రాల్లో పరీక్షరాసిన వందశాతం మంది అర్హత సాధించారు.
- ఇంగ్లిష్/ తెలుగులో 98.71%, ఇంగ్లిష్/ ఉర్దూలో 96.54 % చొప్పున మంది అర్హత సాధించారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- edcet
- entrance test
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్‌లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

