హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు గ్రూపు-2 పరీక్ష ద్వారా ఎంపికైన 97మంది ఎస్సైలను కేటాయించినట్లు ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ వెల్లడించారు. ఇందులో మల్టీజోన్-1కు 63మంది, మల్టీజోన్-2కు 34మంది ఎస్సైల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం పూర్తయింది.
మల్టీజోన్-1లో వెరిఫికేషన్‌కు 63మంది హాజరయ్యారని వరంగల్ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్‌రావు, మల్టీజోన్-2లో వెరిఫికేషన్‌కు 33మంది హాజరయ్యారని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏఈఎస్‌లు స్మిత సౌజన్య, మోహన్‌బాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.