హైదరాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : బీ-ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన ఎప్సెట్(బైపీసీ)సీట్లను సోమవారం కేటాయించారు. మొదటి విడతలోనే 93.5శాతం భర్తీ అయ్యాయి. 10,708 సీట్లకు 10,012 భర్తీ అయ్యాయి. కేవలం 696 సీట్లే ఖాళీగా ఉన్నాయి. బయో మెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీలో 100శాతం భర్తీ అయ్యా యి. సీట్లు పొందిన వారు ఈ నెల 14లోగా ఫీజు చెల్లించాలని సూచించారు.
హైదరాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : జీవో-317 బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవో-190ని సవరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. స్థానికను చేర్చి న్యాయంచేయాలని కోరుతూ జీఏడీ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కాకు వినతిపత్రం అందజేసింది. తరగతికి ఒక టీచర్ను నియమించాలని కోరుతూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను కలిసి తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ వినతిపత్రం సమర్పించారు.