Vitamin-D | 90% మంది మహిళల్లో విటమిన్-డీ లోపం.. అపోలో, హార్లిక్స్ అధ్యయనంలో వెల్లడి
Vitamin-D | 90శాతం మంది మహిళల్లో విటమిన్-డీ లోపం ఉన్నట్టు అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గృహిణులకు 30 మిల్లీగ్రాముల కంటే తక్కువ పరిమాణంలో విటమిన్-డీ మాత్రమే అందుతున్నట్టు తేలింది.
- బాడీ పెయిన్స్, ఎముకల నొప్పులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): 90శాతం మంది మహిళల్లో విటమిన్-డీ లోపం ఉన్నట్టు అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గృహిణులకు 30 మిల్లీగ్రాముల కంటే తక్కువ పరిమాణంలో విటమిన్-డీ మాత్రమే అందుతున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా నగరాల్లో నివసించే మహిళల్లో 80 శాతం మందిలో విటమిన్ డీ లోపాన్ని గుర్తించారు.
సూర్యరశ్మితో విటమిన్-డీ
కేవలం 40 శాతం సూర్మరశ్మి పడినా శరీరానికి కావాల్సినంత పరిమాణంలో విటమిన్-డీ ఉత్పత్తి అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. మహిళలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపు కనీసం 20-30 నిమిషాలపాటు సూర్యరశ్మి తమ శరీరంపై పడేలా చూసుకోవాలని సూచించారు. లేకపోతే వయసు పెరిగేకొద్దీ వచ్చే ఎముకలు గుల్లబారిపోవడం, ఒంటి నొప్పుల సమస్యలు మరింత జఠిలంగా మారుతాయన్నారు. కృత్రిమంగా దొరికే సప్లిమెంట్ల కంటే విటమిన్-డీ పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకుంటే లోపాన్ని సరిచేసుకోవచ్చన్నారు. ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, తరచుగా పుట్టగొడుగులు తీసుకుంటూ శరీరంపై సూర్మరశ్మి పడేలా జాగ్రత్తలు వహించడం వలన విటమిన్ డీ లోపాన్ని క్రమంగా తొలగించుకోవచ్చని చేసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

