Pharmacist Exam | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించారు. 732 పోస్టులకు 27,101 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 24,578 మంది(90.69 శాతం) హాజరైనట్టు అధికారులు తెలిపారు.
పీఆర్టీయూ ‘ఎమ్మెల్సీ’కి బీటీఏ మద్దతు
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులకు బహుజన టీచర్స్ అసొసియేషన్(బీటీఏ) మద్దతు ప్రకటించింది. రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న పింగిలి శ్రీపాల్‌రెడ్డి, వంగ మహేందర్‌రెడ్డి గెలుపునకు కృషిచేస్తామని ప్రకటించింది. శనివారం నారాయణగూడ పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కే చైతన్య, ప్రధాన కార్యదర్శి ఎం గంగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సంతోష్‌నాయక్ మద్దతు లేఖను పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డికి అందజేశారు.