హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని మార్చిలో 19.72 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. హుండీ కానుకల ద్వారా రూ.128.64 కోట్ల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. 9.54 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా, 24.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని పేర్కొన్నది. 1.11 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్టు తెలిపింది.