నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?
నా వయస్సు 85 ఏండ్లు.. నేను బతికే ఉ న్నాను.. అంటూ ఫిల్మ్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధుడు ‘సర్' నోటీసుల తీరుపై ప్ల కార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఫిలింనగర్ డివిజన్ బసవతారకనగర్ బస్తీలో 119 మందికి ‘సర్' నోటీసులు వచ్చాయి.
- ‘సర్’ నోటీసుపై ప్లకార్డుతో వృద్ధుడి వినూత్న నిరసన
బంజారాహిల్స్, అక్టోబర్ 16 : నా వయస్సు 85 ఏండ్లు.. నేను బతికే ఉ న్నాను.. అంటూ ఫిల్మ్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధుడు ‘సర్’ నోటీసుల తీరుపై ప్ల కార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఫిలింనగర్ డివిజన్ బసవతారకనగర్ బస్తీలో 119 మందికి ‘సర్’ నోటీసులు వచ్చాయి. బసవతారకనగర్‌కు చెందిన అమీర్ అలీ (85) అనే వృద్ధుడికి సైతం నోటీసు వచ్చింది.
తాను 30 ఏండ్లుగా బస్తీలో ఉంటున్నానని, ఇప్పటికి 11 ఎన్నికల్లో ఓటు వేశానని, 2002 జాబితాలో సైతం తన పేరు ఉండగా, తనకు నోటీసులు ఎలా ఇస్తారంటూ అమీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 1996 కంటే ముందు తాను మక్తల్ నియోజకవర్గంలో ఓటర్‌గా ఉండేవాడినని, తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంలో అనేకసార్లు ఓటేస్తే ఇప్పుడు ‘సర్’ పేరుతో నా ఓటును తొలగించేందుకు కుట్రలు చేస్తారా అంటూ మండిపడ్డా డు. తాను బతికే ఉన్నానంటూ ప్లకార్డు పట్టుకుని బస్తీలో నిరసన వ్యక్తం చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

