వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 18: వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా మరో 8 రకాల నాణ్యమైన వరి, మక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న వంగడాలను విడుదల చే సింది. సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ, రాష్ట్రస్థాయి వెరైటల్ రిలీజ్ కమిటీ ఆ మోదంతో మంగళవారం వీటిని విడుదల చేసినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ ఎం రఘునందన్‌రావు చెప్పారు. వీటిలో తెగుళ్లను నిరోధించగలిగే ఆర్ఎన్ఆర్ (రాజేంద్రనగర్) 28361, కేఎన్ఎం 7037, డబ్ల్యూజీఎల్ 1289, ఉల్లికోడును తట్టుకోగలిగే వరంగల్ 119 వరి వంగడాలతోపాటు మక్కజొన్నలో హై బ్రిడ్ డీహెచ్ఎం 206, జొన్నలో మా ల్ధండి రకానికి దీటుగా తాండూర్ పరిశోధనా స్థానం తయారు చేసిన ఎస్వీటీ 55, సజ్జలో హైబ్రిడ్ పీబీహెచ్ 1625, కాల్షియం అధికంగా ఉండే పీ ఆర్ఎస్ 38 రాగి వంగడాలు ఉన్నట్టు వివరించారు. ఇప్పటిదాకా 61 కొత్త వంగడాలను విడుదల చేశామన్నారు.