హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మయన్మార్ సైబర్ నేరగాళ్ల ముఠాలోని మొత్తం 15 మంది ఏజెంట్లు, మధ్యవర్తుల్లో 8 మందిని అరెస్టు చేసినట్టు సీఎస్బీ డీజీ శిఖా గోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మిగిలినవారు పరారీలో ఉన్నారని, వారిలో ఐదుగురు విదేశాల్లో ఉన్నారని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 10 మంది బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ ముఠాపై 9 కేసులు నమోదైనట్టు తెలిపారు.