హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): టీజీ పీఈసెట్‌లో భాగంగా రెండేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ), అండర్ గ్రాడ్యుయేట్ డిప్లామా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీ డీపీఈడీ) కోర్సుల్లో అడ్మిషన్లు మొదలయ్యాయి. శుక్రవారం టీజీ పీఈసెట్ కన్వీనర్ విద్యార్థులకు తొలిదశ కౌన్సెలింగ్‌లో సీట్లను కేటాయించారు. కన్వీనర్ కోటాలో 1,737 సీట్లకు తొలిరోజు 753 సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు 28లోగా కాలేజీల్లో రిపోర్టు చేసి ట్యూషన్ ఫీజు చెల్లించాలని కన్వీనర్ సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేశారు. 30, 31న వైవా-వోకో పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. స్పెషల్ లాంగ్వేజీ తెలుగు టెస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ కోసం ఈ వైవా పరీక్షలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీకి స్పోర్ట్స్ కోటాలో పెండింగ్‌లో ఉన్న అభ్యర్థి ఎంపికైనట్టు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారులు వెబ్‌నోట్ విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థికి 28న ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షలు జరుగుతాయని, సదరు అభ్యర్థి తప్పకుండా హాజరు కావాలని తెలిపారు.