600 శునకాల హతం.. వీధి కుక్కల బెడదతో విష ప్రయోగం.. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన
వీధికుక్కల బెడద కారణంగా విషప్రయోగం చేసి వందలాది శునకాలను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకున్నది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా, జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసులు నమోదుచేశారు.
మాచారెడ్డి, జనవరి 14: వీధికుక్కల బెడద కారణంగా విషప్రయోగం చేసి వందలాది శునకాలను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకున్నది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా, జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసులు నమోదుచేశారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌పేట, బండ రామేశ్వర్‌పల్లి, పాల్వంచ, వాడి, భవానీపేట గ్రామాల్లో 600 కుక్కలను చంపి పూడ్చి పెట్టారని జంతు హక్కుల కార్యకర్తలు మూల రజని, అనపోలు అనిత, భానుప్రకాశ్, గోవర్ధన్ తెలిపారు.
ఈ దారుణానికి పాల్పడిన ఐదు గ్రామాల సర్పంచ్‌లపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా వీధికుక్కలను పూడ్చిపెట్టిన ప్రదేశాలను గుర్తించి, కళేబరాలను వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. మరోవైపు, కుక్కలపై విష ప్రయోగం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు సంక్షేమ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల పర్యవేక్షణలోనే ఈ సాముహిక హత్య జరిగినట్టు ఆరోపించారు. జంతు సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

