నర్సంపేట రూరల్, ఏప్రిల్ 7: కాంగ్రెస్ మహిళా నేత ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి రూ.6 లక్షల నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుంటూర్పల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ ఆదివారం నర్సంపేట నుంచి గుంటూర్‌పల్లికి కారులో రూ.6 లక్షలు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్వరం శివారు చెక్‌పోస్టు వద్ద ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేయగా నగదు లభిచింది. ఇందుకు సంబంధించి ఆమె ఎలాంటి ఆధారాలు చూపించక పోవడంతో సీజ్ చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.