హైదరాబాద్ : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఆయా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ భూగర్భ జలవనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 32 గెజిటెడ్, 25 నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 6 నుంచి 27వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. తదితర వివరాల కోసం https://www.tspsc.gov.in/ అనే వెబ్సైట్ను సంప్రదించొచ్చు.