కుమ్రం భీం ఆసిఫాబాద్ : గంజాయి(Cannabis plants) సాగుపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ గంజాయి కట్టడికి పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా బుస్సిమెట్ట క్యాంప్ గ్రామంలో 418 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జైనూరు మండలం బుస్సిమెట్ట క్యాంప్ గ్రామంలో ముగ్గురు రైతులు తమ వ్యవసాయ పొలంటో గంజాయి మొక్కలు పెంతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడుడు నిర్వహించారు.
418 భారీ గంజాయి మొక్కలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.