హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ) 2022 -24 ఫస్టియర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.