మహబూబాబాద్ : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని నెల్లికుదురులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కరోనా బలి తీసుకున్నది. 11 రోజుల వ్యవధిలోనే ఇద్దరు భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 2వ తేదీన తండ్రి, 4న పెద్ద కుమారుడు, 11న చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోగా, ఇవాళ తల్లి మృతి చెందింది. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి(60) తుదిశ్వాస విడిచింది. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.