హైదరాబాద్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): వక్ఫ్ బోర్డుకు చెందిన భవనాల పునరుద్ధరణ, మరమ్మతులకు ప్రభుత్వం రూ. 39,72,98,137నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ సంస్థకు సంబంధించి రాష్ట్రంలో దాదాపు 432 నిర్మాణాలు ఉన్నాయి. 18 జిల్లాల్లో ఉన్న 429 నిర్మాణాలకు రూ.33,27,94,000 నిధులను ఆయా జిల్లా కలెక్టర్లకు రిలీజ్ చేసింది. వీటితో పాటు నాంపల్లిలోని అనీస్ ఉల్ గుర్బాకు రూ.1,44,38,196, హైసూల్, జూనియర్ కాలేజీలకు, మహిళా సాధికారత కేంద్రం పునరుద్ధరణకు రూ.2,60,30,509, అజ్మీర్ షరీఫ్ రుబాత్కు రూ.2,40,35,432 నిధులను విడుదల చేసింది. ఈ నిధుల విడుదల పట్ల వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసివుల్లా ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.