Ram Charan | బుచ్చిబాబుకు మరో ఛాన్స్ ఇవ్వనున్న రామ్ చరణ్ .. ‘పెద్ది’ సక్సెస్ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్‌పై జోరుగా ప్రచారం
Ram Charan | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటిగా నిలిచింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా అథ్లెట్ పాత్రలో రామ్ చరణ్ కనిపించిన తీరు, ఆయన నటన, మేకోవర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Ram Charan | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటిగా నిలిచింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా అథ్లెట్ పాత్రలో రామ్ చరణ్ కనిపించిన తీరు, ఆయన నటన, మేకోవర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన విధానం సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది.‘పెద్ది’ విజయంతో బుచ్చిబాబు పేరు టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా విడుదలకు ముందే రామ్ చరణ్.. బుచ్చిబాబుతో మరో సినిమా చేయాలనే ఆసక్తి వ్యక్తం చేశారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ ప్రచారం మరోసారి తెరపైకి రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి భారీ అడ్వాన్స్ అందేలా రామ్ చరణ్ స్వయంగా సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడికి అడ్వాన్స్ కూడా అందిందని, త్వరలోనే కొత్త కార్యాలయం ప్రారంభించి స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే, ఈ విషయంపై రామ్ చరణ్, బుచ్చిబాబు లేదా సంబంధిత నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్‌తో చేయనున్న భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బుచ్చిబాబుతో మరోసారి చేతులు కలపనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘పెద్ది’తో సాధించిన విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా ఈసారి భారీ కథను సిద్ధం చేయాలనే ఆలోచనలో దర్శకుడు బుచ్చిబాబు ఉన్నట్లు కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాకు భిన్నంగా మరో కొత్త జానర్లో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్–బుచ్చిబాబు కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఏర్పడింది. ‘పెద్ది’లో చరణ్‌ను పూర్తిగా కొత్త కోణంలో చూపించిన బుచ్చిబాబు, మరోసారి అదే స్థాయిలో పవర్ఫుల్ కథతో వస్తే ఈ కాంబినేషన్ మరో భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- buchi babu
- peddi
- ram charan
- sukmar
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

