81 మంది ఏఆర్ ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్
రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్ల కంటే ఎక్కువ కాలం ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలనే ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు 81 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఏఆర్)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఐజీ వీబీ కమలాసన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
- మల్టిజోన్-1లో 34, మల్టిజోన్-2లో 47 మంది
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మూడేండ్ల కంటే ఎక్కువ కాలం ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలనే ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు 81 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఏఆర్)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఐజీ వీబీ కమలాసన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2020 జనవరి 31 నుంచి 2024 జనవరి 31 వరకు కటాఫ్ డేట్ ప్రకారం.. నాలుగేండ్ల సర్వీస్ వచ్చే పోలీసు అధికారులు, ఇప్పటికే మూడేండ్లు పూర్తి చేసుకున్న పోలీసు అధికారులకు ఈ నిబంధన వర్తించింది.
ఈ మేరకు మల్టీజోన్-1 నుంచి 34 మంది ఏఆర్ సీఐలు, మల్టిజోన్-2 నుంచి 47 మంది ఏఆర్ సీఐలను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు ఐజీ ఆదేశాలు జారీ చేశారు. మల్టిజోన్-2 నుంచి ఐదుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీతో పాటు కొత్త పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో భూత్పూర్ సీఐ జీ రజితరెడ్డి, వెల్దండ సీఐ ఎస్ రామకృష్ణ, వనపర్తి సీసీఎస్ ఎస్ శ్రీనివాసచారి, మరికల్ సీఐ పీ శ్రీకాంత్‌రెడ్డి, జహీరాబాద్ సీఐ టీ భూపతి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

